ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఉఏన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. బీకామ్, బీబీఏ, బీబీఎం వంటి డిగ్రీలు చదివిన వారు కంప్యూటర్స్‌పై మంచి పట్టు ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఏపీలో ఉన్న మచిలీపట్నం BELలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో 10 ఏళ్ల వరకు సడలింపులు ఉంటాయి.
ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందుకు గాను ఫిబ్రవరి 21ని చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్షను మార్చి 16వ తేదీన నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆప్టిట్యూట్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్‌లో 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 100 మార్కులు ఉంటాయి. ఈ టెస్టులో పాస్ అయిన వారికి జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇస్తారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.295 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ దరఖాస్తు చేసే సమయంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేల నుంచి జీతం మొదలవుతుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ సదుపాయాన్ని అందిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://bel-india.in/job-notifications అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.