Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో ద్వారా ఆయనలో ఉన్న మరో కోణం ఏమిటి అనేది ప్రేక్షకులందరికీ అర్థమైంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు బాలకృష్ణకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఎవరినైనా ఆయన వెంటనే కొట్టేస్తారు, ఆయనతో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని భావించిన వారికి ఈ షోతో అతనెంటో నిరూపించాడు. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సక్సెస్ ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. రెండో సీజన్ ని పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌తో ముగించారు.
రెండు భాగాలుగా ప్రసారం కానున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తొలి భాగం ఫిబ్రవరి 2న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. తొలి భాగం చాలా సరదాగా సాగింది. పవన్ కళ్యాణ్‌ను భయ్యా అంటూ సరదాగా పిలిచిన బాలయ్య ఆయన దగ్గర నుంచి సమాచారం బాగానే రాబట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా నలిగిన మూడు పెళ్లిళ్ల అంశంలో పవన్ కళ్యాణ్ కోణం ఏంటో పూర్తిగా ప్రజలు తెలుసుకునేలా చేశారు. ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా అని బాలయ్య ప్రశ్నించగా.. తన మొదటి పెళ్లి నుంచి అన్ని వివరాలు పూసగుచ్చినట్లు వివరించారు. నాకు మొదటి వివాహం జరిగే సమయానికి పెళ్లి అంటే సరైన అవగాహన లేదు. కానీ కుటుంబ సభ్యులు వివాహం చేశారు. దీనితో మొదటి భార్యతో అభిప్రాయాలు కుదర్లేదు. అందుకే విడిపోవాల్సి వచ్చింది.
![Pawan Kalyan : తాను 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో.. అసలు విషయం చెప్పిన పవన్.. ఏమన్నారంటే..? Pawan Kalyan told why he married 3 times](https://i0.wp.com/indiadailylive.com/wp-content/uploads/2023/02/pawan-kalyan.jpg?resize=1200%2C675&ssl=1)
రెండవ భార్యతో కూడా కొన్ని అభిప్రాయాలు కుదర్లేదట. దాంతో రెండవ పెళ్లి కూడా అలా అయిపోయింది. ఆ తర్వాత మూడవ వివాహం చేసుకున్నాను అని పవన్ తెలిపారు. అయితే అసలు మొదట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు అని పవన్ తెలిపాడు. ఒక యోగిలాగా మారుదామని అనుకున్నా. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలనే ఆలోచన ఉండేది. కానీ అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది అని పవన్ స్పష్టం చేశాడు. నా పెళ్లిళ్ల విషయంలో తిడుతున్నప్పుడు నేను కూడా వాళ్ళని తిరిగి తిట్టొచ్చు. కానీ నాకు సంస్కారం అడ్డు వస్తోంది. వ్యక్తిగతంగా తిడితే వాళ్ల కుటుంబాలు బాధపడతారు. అందుకే ఎప్పుడు పర్సనల్ కామెంట్స్ చేయను అని పవన్ అన్నారు.