Pawan Kalyan : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గత రాత్రి స్ట్రీమింగ్ అయింది.ఇందులో అనేక ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. ఇప్పటివరకు తన మనోగతాన్ని ఎవరి ముందూ బయట పెట్టని పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షోలో మాత్రం తన ఉద్దేశాలను, భావాలను, తన బాధలను పంచుకున్నాడు. సాయి ధరమ్‌కి బైక్ ప్రమాదం జరిగినప్పుడు అతను నెల రోజుల పాటు బెడ్‌పై ఉండడం, అతని గురించి బయట రకరకాల ప్రచారాలు జరుగుతుండడం నన్ను ఎంతగానో కలిచి వేసిందని పవన్ అన్నారు.
సాయి ధరమ్ కి యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పడంతో, వెంటనే నేను ఆసుపత్రికి వెళ్ళాను. తన పరిస్థితి చూసి చలించిపోయాను. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా సాయి ధరమ్ కోమాలో నుంచి బయటకు రాకపోవడంతో ఏం జరిగిందోనని చాలా భయం వేసింది.ఇక బయట అతని గురించి ఓవర్ స్పీడ్లో బైక్ నడిపారు. తాగి ఉన్నాడంటూ నిరాధార కథనాలు తెరపైకి తెచ్చారు. అవన్నీ వింటుంటే చాలా బాధేసేది. ఇక సాయి ధరమ్ తేజ్ నా ముందు చాలా వినయంగా ఉంటాడు. అది నటన అని చాలా మంది అనుకుంటారు.
అది నటన కాదు నిజం. చిన్నప్పటి నుండి వాళ్ళు అలానే పెరిగారని పవన్ చెప్పుకొచ్చారు. సాయి ధరమ్ గురించి మాట్లాడుతూ పవన్ కన్నీరు పెట్టుకోవడం అందరి మనసులు బరువెక్కేలా చేసింది. పవన్ కళ్యాణ్ తమని చాలా పద్దతిగా పెంచారని సాయి ధరమ్ చెప్పుకొచ్చారు. ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే రోజుల్లో నేను ఫ్లైట్ మిస్ కావడంతో, ఆ విషయం పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్పగా నన్ను మందలించారు. నీకు డబ్బులు విలువ తెలియడం లేదురా… ఈసారి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళు అని అన్నారు.. చిన్నప్పటి నుండి అలా క్రమశిక్షణగా పెంచారని సాయి ధరమ్ షోలో చెప్పుకొచ్చారు.