మహానటి కీర్తి సురేష్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా అంతే చురుకుగా ఉంటూ తన అభిమానులను సందడి చేస్తుంటారు. కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
తాజాగా కీర్తి సురేష్ వరల్డ్ పిక్నిక్ డే అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా పిక్నిక్ అంటే లైఫ్ పార్టనర్ తో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తారు. కానీ కీర్తి సురేష్ మాత్రం తనకెంతో ఇష్టమైన తన పెట్ నైక్తో కలిసి పిక్నిక్ డే ను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోను షేర్ చేస్తూ.. ఇంతకంటే ఇంకేం కావాలి… సరైన పార్ట్నర్ తో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఈమె నటించిన “గుడ్ లక్ సఖి”చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించి ఈ సినిమాను ఎలాంటి పరిస్థితులలో కూడా ఓటీటీలో విడుదల చేయబోమని థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.