దేశంలోని పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. వాటిల్లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కూడా ఒకటి. మోదీ మొదటి సారి ప్రధాని అయ్యాక ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల దేశంలోని పౌరులందరికీ బ్యాంకు సేవలు లభిస్తాయి. వారు చిన్న మొత్తాల్లో డబ్బును బ్యాంకుల్లో పొదుపు చేసుకోవచ్చు. లోన్లు తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్, పెన్షన్లు వస్తాయి. దీని వల్ల పేదలు దేశంలోని ఏ బ్యాంకులో అయినా సరే జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.
జన్ ధన్ ఖాతాలు కలిగిన వారికి పలు ప్రత్యేక సదుపాయాలు లభిస్తాయి. వారు ఓవర్ డ్రాఫ్ట్, రుపే డెబిట్ కార్డులు వంటి సదుపాయాలను పొందవచ్చు. అయితే సంక్షోభం సమయంలో ఈ ఖాతాదారులకు కేంద్రం ఆర్థిక సహాయం కూడా అందజేస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్ సమయంలో జన్ ధన్ ఖాతాల్లో నగదు జమ చేశారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.
అయితే జన్ ధన్ ఖాతా ఉన్నవారికి మొత్తం రూ.1.30 లక్షల ప్రయోజనం కలుగుతుంది. రూ.1 లక్ష మేర యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌తోపాటు రూ.30వేల మేర సాధారణ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఖాతాదారులు యాక్సిడెంట్ బారిన పడితే ఈ ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే జన్‌ధన్ ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి.
జన్ ధన్ ఖాతాలను సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఓపెన్ చేస్తారు. కానీ ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఈ ఖాతాలను తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఇప్పటికే సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారు వాటిని జన్ ధన్ ఖాతాలుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ క్రమంలో 10 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా సరే జన్‌ధన్ ఖాతాను తెరవచ్చు. అందుకు గాను ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ, పాస్‌పోర్టు, ఉపాధి హామీ కూలి పత్రం వంటివి అవసరం అవుతాయి. దీంతో బ్యాంకు వారు కేవైసీ పూర్తి చేసి ఖాతాను తెరుస్తారు.
ఇక జన్ ధన్ ఖాతాను ఆధార్‌కు సులభంగానే అనుసంధానం చేయవచ్చు. ఇందుకు గాను అనేక బ్యాంకులు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్‌ను అందిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్ తెలియకపోతే బ్యాంకులో సంప్రదించి జన్ ధన్ ఖాతాను ఆధార్‌కు సులభంగా లింక్ చేసుకోవచ్చు. దీంతో పైన తెలిపిన రూ.1.30 లక్షల ప్రయోజనం లభిస్తుంది.