మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ యూజర్లకు అద్భుతమైన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్లిప్ట్ (Clipt) పేరిట ఈ యాప్ లభిస్తోంది. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవారు ఆ ఫోన్ లోని ఫైల్స్ ను పీసీకి, పీసీలోని ఫైల్స్ ను ఫోన్‌కు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కేబుల్‌ను కనెక్ట్ చేసి ఫోన్‌కు పర్మిషన్స్ ఇచ్చి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కానీ క్లిప్ట్ యాప్ సహాయంతో ఆ పని సులభతరం అవుతుంది.
క్లిప్ట్ యాప్‌ను యూజర్లు ముందుగా ఫోన్‌లో వేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. ఆ తరువాత పీసీలో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి అందులో క్లిప్ట్ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. తరువాత యాప్, ఎక్స్‌టెన్షన్ రెండింటిలోనూ ఒకే గూగుల్ అకౌంట్‌తో కనెక్ట్ అవ్వాలి. దీంతో ఆ అకౌంట్‌కు చెందిన గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అవుతుంది. అందులో అప్‌లోడ్ చేసిన ఫైల్స్ ఫోన్, పీసీ రెండింటిలోనూ లభిస్తాయి. వాటిని సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పీసీ ద్వారా అప్‌లోడ్ చేసే ఫైల్స్ ను ఫోన్‌లో, ఫోన్ ద్వారా అప్‌లోడ్ చేసే ఫైల్స్ ను పీసీలో యాక్సెస్ చేయవచ్చు. ఇలా ఫోన్, పీసీల మధ్య డేటాను సులభంగా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.
అయితే క్లిప్ట్ ద్వారా ఒకసారికి 10 ఫైల్స్ న మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. అందువల్ల ఎక్కువ ఫైల్స్ ను ట్రాన్స్ ఫర్ చేయాలంటే ఎక్కువ సమయం పాటు యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ యాప్ ద్వారా డేటాను వేగంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఇక విండోస్‌తోపాటు మాక్ కంప్యూటర్లను వాడే వారు కూడా క్రోమ్ బ్రౌజర్‌లో ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉపయోగించవచ్చు.