Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి నిద్రించే వరకు చాలా మంది అందులో విహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం వీటిని పాపులర్ అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకుని పాపులర్ అయిన వారు చాలా మందే ఉన్నారు. రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లు తమ పోస్టులను షేర్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.
ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పట్లో టిక్‌టాక్ ఉండేది. కానీ ఆ యాప్‌ను నిషేధించాక రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇక కొందరు రీల్స్ చేయకున్నా ఇతరులు చేసే రీల్స్‌ను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన రీల్స్ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేయడం విశేషం. అచ్చ హీరోయిన్‌లా డ్యాన్స్ చేసింది అంటే.. అతిశయోక్తి కాదు.
ఇటీవలే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ థియేటర్లలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓటీటీలోనూ స్ట్రీమ్ అవుతోంది. కానీ ఇందులోని రాను రానంటూనే.. పాటకు చాలా మంది ఫిదా అవుతున్నారు. అందులో నటి అంజల్ ఐటమ్ భామగా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అప్పట్లో నితిన్ జయం మూవీలోని పాట ఇది. మళ్లీ ఈ మూవీలో వాడారు. ఇక ఇదే పాటకు ఆ యువతి డ్యాన్స్ చేసి ఔరా.. అనిపించింది. ఆమె డ్యాన్స్ బాగుందని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
View this post on Instagram