యోగ గురువు రాందేవ్ బాబా పొట్టను వెనక్కి లాగి రుబ్బురోలు క్రమంలో తన పొట్టను తిప్పిన సంఘటన అందరికీ గుర్తుంటుంది. ఈ వీడియో చూసిన కొందరు ఆ యోగాసనం ప్రయత్నించక మానలేదు. అయితే ఈ ఆసనం తమ చేత కాదని ఎంతోమంది వారి ప్రయత్నాన్ని వదులుకున్నారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా రాందేవ్ బాబాను మించిపోయి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ మహిళ ఉన్నఫలంగా తన పొట్టను మాయం చేసింది. ఈ విధంగా పొట్ట మాయమవడమే కాకుండా ఏకంగా ఎముకలు కూడా బయటకు వచ్చింది. ఈ సంఘటన చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమె పొట్ట లోపలికి వేలుపెట్టి ఇది నిజమా కాదా అని చెక్ చేశారు.
ఈ విధంగా ఆ మహిళ చేసిన స్టంట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతోమంది ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ వీడియో చూసిన ఏ ఒక్కరు కూడా ఈ విధంగా ప్రయత్నించవద్దని ఇలా చేయాలంటే ఎంతో అనుభవం కలిగి ఉండాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా పేగులలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది కాబట్టి ఎవరు ప్రయత్నించకుండా కేవలం ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.