దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలను వేస్తున్నారు. అయితే టీకాలను తీసుకునేందుకు కొందరు మాత్రం భయపడుతున్నారు. పెద్దలు కూడా టీకాలు అంటే భయపడుతున్నారు. ఓ మహిళ కూడా ఇలాగే టీకా అంటే తెగ భయపడింది. టీకా వేయించుకునేటప్పుడు చిన్న పిల్లల మాదిరిగా అరిచింది. ఈ క్రమంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అయితే ఇది ఆమె తప్పు కాదు. ఆమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టీకాలు, ఇంజెక్షన్లు, మందులు అంటే చాలా మంది భయపడుతుంటారు. అలాంటి భయాన్ని Trypanophobia అంటారు. ఇక ఆమె అలా అరవడంతో ఆ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
https://www.instagram.com/reel/CRIvHdtj29A/?utm_source=ig_embed&ig_rid=ded59550-4f58-4ed5-b4c0-3d13ee168f26&ig_mid=383A76B0-C5E6-4826-89B0-DEE60853E80C
అయితే ఇది కొత్తేమీ కాదు. ఇటీవలే ఇలాంటిదే ఇంకో సంఘటన జరిగింది. ఓ మహిళను తమ కుటుంబ సభ్యులు పట్టుకుని వ్యాక్సిన్ సెంటర్‌కు తీసుకువచ్చి మరీ టీకాను వేయించారు. అది కూడా అప్పట్లో వైరల్ అయింది.
https://twitter.com/rupin1992/status/1409923305755217925