సాధారణంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ప్రమాదం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే మంగళూరులో స్కూటీ పై ప్రయాణిస్తున్న ఓ మహిళ ఈ విధమైనటువంటి ప్రమాదానికి గురైంది. స్కూటీ పై ప్రయాణిస్తున్న ఆ మహిళ అదుపు తప్పి భారీ లోతు ఉన్న ఓ గోతిలోకి స్కూటీతో సహా పడిపోయింది.
ఆ మహిళ మొదటగా రోడ్డు మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని తిప్పుకోవడంలో అదుపు తప్పడంతో స్కూటీ కిందికి పడింది. ఈ క్రమంలోనే ఆ మహిళ స్కూటీని లేపి ఎస్కలేటర్ పై రైజ్ చేయడంతో స్కూటీతో సహా రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి పడిపోయింది. ఈ సంఘటనను అటుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు చూసాడు.
ఈ క్రమంలోనే అతనితోపాటు ఆ దారి వెంట వెళ్లే మరికొంత మంది ప్రయాణికులు ఆ మహిళను గోతిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ మలుపు వద్ద జరిగిన సంఘటన 21 ఏప్రిల్ బుధవారం జరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రమాదానికి గురైన ఆ మహిళను ఇతర ప్రయాణికులు రక్షించడంతో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.