ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ ప్రతి ఒక్కరు జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే ఎంతో మంది వారి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందటం వల్ల మాస్క్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సాధారణంగా దుస్తులు ధరించిన మాదిరిగానే ప్రజలు మాస్కులు ధరించడానికి అలవాటు పడ్డారు. ఈ విధంగా ఒక వ్యక్తి మాస్కు పెట్టుకొని తోటలోని సన్‌బాత్‌కు వెళ్లగా.. తిరిగి ఇంటికి వచ్చేసరికి తన మొహం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొవిడ్ ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని తన తోటలోని సన్‌బాత్‌కు వెళ్లగా.. అతని మొహం పై మాస్క్ ఆకారంలో ముద్ర ఏర్పడటంతో అది చూసిన అతను ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సన్‌బాత్ చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్కు తీసేయాలని లేకపోతే లేకపోతే తనలాగా బాధ పడాల్సి వస్తుందని తెలుపుతూ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
https://twitter.com/TheoShantonas/status/1402010794779463685?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1402010794779463685%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsocial-media%2Ftake-your-mask-while-sunbathing-man-learnt-his-lesson-1369800
ఈ క్రమంలోనే ఈ వీడియోను వీడియోను ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాంప్‌మ్యాన్ షేర్ చేస్తూ.. నేను ఈ వీడియోను చూడగానే నేను నవ్వు ఆపుకోలేక పోయాను.. ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.