ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆకట్టుకునే వీడియోలను షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. కొన్ని మేకలన్నీ కలసి పాలు తాగుతున్న వీడియో అది. దాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ఒక వ్యక్తి పాలతో నిండిన బాటిల్స్‌ను తెచ్చి ఒక స్టాండ్‌లో వరుసగా పెట్టగానే అక్కడే ఉన్న మేక పిల్లలు అన్నీ ఆ బాటిల్స్‌లోని పాలను తాగడం ప్రారంభించాయి. అయితే కొన్ని మేకలకు బాటిల్స్ అందకపోవడంతో ఆ వ్యక్తి వాటిని తీసి పక్కనే ఉన్న ఇంకొన్ని బాటిల్స్ వద్ద ఉంచాడు. ఈ క్రమంలో మేకలన్నీ తోకలు ఊపుతూ భలే సరదాగా పాలను తాగడం ప్రారంభించాయి.
It’s supposed to be just a cute animal video but I think the world may have discovered a new form of energy: #tailpower Hitch those wagging tails to a turbine & presto, you have electricity… ? pic.twitter.com/7r6m1RjkTn
— anand mahindra (@anandmahindra) April 10, 2021
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో దానికి ఇప్పటికే 1.70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. రక రకాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. చూడబోతే ఇది ఓ సింపుల్ వీడియో లాగే ఉంది. కానీ ప్రపంచం దీని ద్వారా ఒక శక్తి రూపాన్ని సృష్టించవచ్చు.. అని ఆనంద్ మహీంద్రా ఆ వీడియోకు కామెంట్ పెట్టారు.