సాధారణంగా మన ఇంట్లో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకుని మన ఇష్టదైవాల విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టుకొని పూజిస్తాము. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు. అయితే పూజగదిలో కొన్ని విగ్రహాలను,ఫోటోలను ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా పూజగదిలో కొందరు ఎంతో ఎత్తయిన విగ్రహాలను పెడుతుంటారు. ఈ విధంగా ఎత్తైన విగ్రహాలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఎత్తైన విగ్రహాలు పెట్టడం వల్ల ప్రతిరోజు మహానైవేద్యం, వారానికొకసారి అభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. కనుక పూజ గదిలో ఎత్తయిన విగ్రహాలను కాకుండా చిన్న పరిమాణంలో ఉండే విగ్రహాలను పెట్టుకుని పూజించాలి.
అదే విధంగా మన ఇంట్లో పూజ గది ప్రత్యేకంగా లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు పెట్టకూడదు. అదేవిధంగా కృష్ణుడు చేతిలో పిల్లనగ్రోవి పట్టుకొని ఉన్నటువంటి ఫోటోలను కూడా ఇంట్లో ఉంచకూడదు. అలాగే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఈ విధమైనటువంటి ఉగ్ర రూపంలో ఉన్న స్వామి వారి విగ్రహాలను పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు చికాకులు ఆందోళనలు తలెత్తుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.