ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ దేశంలోని పౌరులకు ఓ సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీని తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య సుప్రీమ్ పేరిట ఈ పాలసీని అందిస్తోంది. ఇందులో భాగంగా మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. ప్రొ, ప్లస్, ప్రీమియం అని ఉంటాయి. వాటిల్లో నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రీమియం, కవరేజి, బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ పాలసీ ద్వారా ఏకంగా రూ.5 కోట్లకు కవరేజి లభించేలా పాలసీని తీసుకోవచ్చు.
18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారితోపాటు 91 రోజుల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రెండు విభాగాల్లో ఈ పాలసీని అందిస్తున్నారు. 1, 2, 3 ఏళ్ల కాలవ్యవధితో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా పూర్తి స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజి లభిస్తుంది. 20 బేసిక్ కవర్స్, 8 ఆప్షనల్ కవర్స్ లభిస్తాయి.
ఈ పాలసీతో ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్, మెంటల్ హెల్త్ కేర్, హెచ్ఐవీ, ఎయిడ్స్ చికిత్స, ఎమర్జెన్సీ చికిత్స వంటి బేసిక్ కవర్స్ లభిస్తాయి. అలాగే 8 రకాల యాడాన్ బెనిఫిట్స్ ను , రెన్యువల్ బెనిఫిట్స్‌ను అందిస్తారు.