టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.3499కి ఏడాది వాలిడిటీ ఉన్న ఓ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే 365 రోజులకు 1095 జీబీ డేటా ఉచితంగా వస్తుందన్నమాట. ఇక డేటా అయిపోయాక స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది.
ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా, సెక్యూరిటీ, క్లౌడ్, న్యూస్ యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
ఇక ఇప్పటికే ఏడాది వాలిడిటీ ఉన్న పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో రోజూ తక్కువ డేటా వస్తుంది. రూ.2121 ప్లాన్‌తో రోజుకు 1.5జీబీ డేటా, రూ.2399తో రోజుకు 2 జీబీ డేటా, రూ.2599 ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. ఈ క్రమంలో రోజుకు 3జీబీ డేటా వచ్చే ప్లాన్‌ను జియో లాంచ్ చేయడం విశేషం.