జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఇక రోజువారీ డేటా లిమిట్ లేదు..!

June 12, 2021 4:20 PM

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. జియోలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్లాన్ల‌పై అందించే డేటాకు రోజు వారీ లిమిట్‌ను విధించారు. అంటే రోజుకు 1జీబీ, 1.5జీబీ, 2, 3 జీబీ చొప్పున మాత్ర‌మే డేటాను ఉప‌యోగించుకునేందుకు వీలుండేది. డేటా లిమిట్ దాటితే మ‌ళ్లీ 24 గంట‌ల పాటు వేచి చూడాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌పై ఆ ఇబ్బంది ఉండ‌దు. ఎందుకంటే జియో అపరిమిత డేటా ప్లాన్స్‌ను ప్ర‌క‌టించింది. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

jio launched new prepaid plans that offer no daily limit on data

జియో ప్ర‌క‌టించిన అప‌రిమిత డేటా ప్లాన్స్‌లో భాగంగా రూ.127తో రీచార్జి చేసుకుంటే 15 రోజుల వాలిడిటీతో 12 జీబీ డేటా వ‌స్తుంది. 15 రోజుల్లోగా ఆ డేటాను ఎప్పుడైనా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే రూ.247 ప్లాన్‌తో 25జీబీ డేటా వ‌స్తుంది. ఈ ప్లాన్‌కు 30 రోజుల వాలిడిటీని నిర్ణ‌యించారు. ఆలోగా 25 జీబీ డేటాను ఎప్పుడైనా వాడుకోవ‌చ్చు. అలాగే రూ.447 నుంచి రూ.2,397 వ‌ర‌కు వివిధ ర‌కాల అపరిమిత డేటా ప్లాన్స్ ను జియో ప్ర‌వేశ పెట్టింది.

జియో ఈ ప్లాన్ల‌ను నో డెయిలీ లిమిట్ విభాగం కింద అందుబాటులో ఉంచింది. వీటిని ప్రీపెయిడ్ యూజ‌ర్లు రీచార్జి చేసుకోవ‌చ్చు. రూ.447 ప్లాన్‌లో 50జీబీ డేటా వ‌స్తుంది. దీన్ని 60 రోజుల్లోగా వాడుకోవ‌చ్చు. ఇక ఈ ప్లాన్ల‌న్నింటిలోనూ రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. జియో యాప్స్‌ను ఉచితంగా స‌బ్ స్క్రైబ్ చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఇక రోజువారీ డేటా లిమిట్ లేదు..!”

Leave a Comment