ఫైర్-బోల్ట్ అనే కంపెనీ ఫైర్-బోల్ట్ బీస్ట్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 1.69 ఇంచుల కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వాచ్ ఫేస్‌లను ఇందులో మార్చుకోవచ్చు. 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. వాచ్‌కు ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. ఎస్‌పీ వో2 సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. హార్ట్ రేట్‌ను ట్రాక్ చేయవచ్చు.
ఫైర్-బోల్ట్ బీస్ట్ ఫీచర్లు
- 1.69 ఇంచుల కలర్ డిస్‌ప్లే, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్
- బ్లూటూత్ 5.0, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ
- 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్, బ్లడ్ ప్రెషర్ మానిటర్, హార్ట్ రేట్ ట్రాకర్, ఎస్‌పీవో2 సెన్సార్
- స్లీప్, స్టెప్స్, కెలోరీస్, డిస్టాన్స్ ట్రాకర్, ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్
- కాలర్ ఐడీ, కాల్ రిజెక్ట్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్
- వెదర్ ఫోర్‌క్యాస్ట్, 8 రోజుల వరకు బ్యాటరీ లైఫ్
ఫైర్ – బోల్ట్ బీస్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.3,999 ధరకు ఈ వాచ్ అమెజాన్‌లో లభిస్తోంది.