ఆడియో, వియరబుల్ తయారీదారు బోట్.. ఎక్స్‌ప్లోరర్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో ఇన్‌బిల్ట్ జీపీఎస్‌ను అందిస్తున్నారు. 1.3 ఇంచ్ కలర్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ రెసిస్టెన్స్ తదిర ఫీచర్లను అందిస్తున్నారు.
బోట్ ఎక్స్‌ప్లోరర్ ఫీచర్లు
- 1.3 ఇంచ్ కలర్ టచ్ డిస్‌ప్లే, 240 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- డౌన్‌లోడబుల్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్, బ్లూటూత్ 4.2, వైబ్రేషన్ అలర్ట్స్
- హార్ట్ రేట్ ట్రాకింగ్, వెల్‌నెస్ మోడ్, స్లీప్, హార్ట్ రేట్, మెన్‌స్ట్రుయేషన్ సైకిల్ ట్రాకర్
- గైడెడ్ మెడిటేషన్ బ్రీతింగ్, 8 యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్, బిల్టిన్ జీపీఎస్
- వాటర్ రెసిస్టెన్స్, రిమోట్ కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్
- 210 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 నుంచి 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
బోట్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, ఆరెంజ్ ఫ్యుషన్, గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.2,999 ధరకు ఈ వాచ్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తోపాటు బోట్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.