దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి రోజున ఆమె పార్టీని ప్రకటించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. వైఎస్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె హైదరాబాద్‌కు వచ్చి అధికారికంగా పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.
అయితే షర్మిల రాజకీయ పార్టీపై ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై జగన్ వ్యాఖ్యలు చేశారు. తాము పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలనుకుంటున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం తమకు ఇష్టం లేదని జగన్ అన్నారు. షర్మిల పార్టీపైనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. రేపు ఎవరైనా షర్మిల పార్టీ గురించి సీఎం జగన్‌ను అడిగితే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలనే జగన్ ఇప్పుడు ఈ విధంగా అని ఉంటారని, దీంతో ఇకపై ఎవరూ ఆ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావనకు తేకుండా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.