క్రిస్పీ ఫ్రాన్స్ పాప్ కార్న్.. ఈ విధంగా తయారు చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు..!

July 6, 2021 12:03 PM

సాధారణంగా వివిధ రకాల పాప్ కార్న్ తయారుచేసుకుని తింటూ ఉంటాము. అయితే పోషకాలు ఎన్నో పుష్కలంగా లభించేటటువంటి రొయ్యలతో పాప్ కార్న్ తయారు చేసుకుంటే తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు అందుతాయి. అయితే ఈరోజు రొయ్యలతో పాప్ కార్న్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

how to make france pop corn

కావలసిన పదార్థాలు

*రొయ్యలు అరకిలో

*అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు

*మైదా టేబుల్ స్పూన్

*కారం 1 టీ స్పూన్

*నిమ్మరసం టేబుల్ స్పూన్

*గరం మసాలా టేబుల్ స్పూన్

*పాలు టేబుల్ స్పూన్

*గుడ్లు 1

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

*బ్రెడ్ పౌడర్ అర కప్పు

*జీలకర్ర టేబుల్ స్పూన్

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకొని రొయ్యలను శుభ్రం చేసి అందులో వేసుకోవాలి. ఈ గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం పొడి, తగినంత ఉప్పు కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మరొక గిన్నెలో బ్రెడ్ పౌడర్, జీలకర్ర, గరంమసాలా, మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్రమంలోనే స్టవ్ మీద కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలను ఒక కోడిగుడ్డును వేసి ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. ముందుగా ఒక్కో రొయ్యను తీసుకుని గుడ్డు పాల మిశ్రమంలో ముంచి, ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకొని వేడివేడిగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ రొయ్యల పాప్ కార్న్ తయారైనట్లే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment