ఆలోచన అంటూ ఉండాలే గానీ చిన్న పనిచేసి కూడా రూ.కోట్లలో ఆదాయం సంపాదించవచ్చు. అవును. అందుకు ఉదాహరణే ఈ క్యాండీ. పచ్చిమామిడి కాయ రుచిని పోలి ఉంటుంది. నోట్లో వేసుకోగానే ఆ పులుపుదనానికి ఎవరైనా సరే కళ్లు మూసుకుంటారు. పచ్చి మామిడికాయ టేస్ట్‌ను అచ్చం అలాగే అందించి ఈ క్యాండీ ఎంతగానో పేరుగాంచింది. దీన్ని తయారు చేసేవారికి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది.
డీఎస్ గ్రూప్ సంస్థ ఈ క్యాండీని తయారు చేసింది. ఈ క్యాండీ అమ్మకాలు 8 నెలల్లోనే రూ.100 కోట్లు తాకగా 2 ఏళ్లలో రూ.300 కోట్ల అమ్మకాలు జరిగాయి. అది కూడా ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండానే ఇంత పబ్లిసిటీ ఈ క్యాండీకి లభించింది. కారణం.. ఆ క్యాండీ అందించే రుచే. సహజత్వానికి చాలా దగ్గరగా దాని రుచి ఉంటుంది. అందుకనే వినియోగదారులు ఈ క్యాండీని ఆదరిస్తున్నారు.
ఇక పల్స్ క్యాండీకి కొందరు ఏకంగా ఫేస్‌బుక్‌లో ఫ్యాన్ పేజీలను కూడా క్రియేట్ చేశారు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ క్యాండీ పాపులర్ అయింది. 2 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలకు దీటుగా ఈ క్యాండీ భారీ స్థాయిలో అమ్మకాలు పూర్తి చేసుకుంది. అవును మరి.. ఐడియా అంటూ ఉంటే ఎంత చిన్న పనితో అయినా భారీ మొత్తంలో లాభం పొందవచ్చు. అందుకు ఈ క్యాండీ కంపెనీయే ఉదాహరణ.