మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివాసం ఉండే రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులు కొన్నేళ్ల కిందట రెండు మామిడి మొక్కలను నాటారు. అవి ఇతర మామిడి మొక్కల్లాగే పెరిగి పెద్దగయ్యాయి. కాయలు కూడా కాశాయి. అవి రూబీ కలర్‌లో ఉండడం విశేషం. అయితే ఆ మామిడి పండ్లు జపాన్‌కు చెందిన అత్యంత అరుదైన జాతికి చెందిన మియాజకి అనే మామిడి వెరైటీకి చెందినవని వారు తరువాత గుర్తించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో మియాజకి మామిడి పండ్లను అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. కేజీకి సుమారుగా రూ.2.70 లక్షల ధర పలుకుతాయి. ఎందుకంటే ఈ మామిడి పండ్లు చాలా తక్కువ సంఖ్యలో పండుతాయి. రుచి చాలా తియ్యగా ఉంటాయి. అందుకనే వీటికి అంత ఖరీదు ఉంటుంది.
అయితే గతేడాది ఈ మామిడి పండ్లు కాశాక కొందరు దొంగలు కాయలను దొంగిలించారు. దీంతో ఆ దంపతులు ఈసారి తోటలో ఆరు కుక్కలు, నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. వారు ఆ మామిడి చెట్లను, కాయలను కాపలా కాస్తున్నారు.
ఇక ఆ మామిడి పండ్లకు ఎంత రేటైనా సరే చెల్లించేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ దంపతులు మాత్రం వాటిని తాము ఇప్పుడే అమ్మబోమని, వాటితో మరిన్ని చెట్లను పెంచుతామని చెబుతున్నారు. ఇక సైంటిస్టులు ఆ అరుదైన జాతికి చెందిన మామిడి పండ్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్తున్నారు.