ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే మీరు తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ప‌నిచేస్తున్న‌ట్లే లెక్క‌..!

May 1, 2021 6:37 PM

క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా అనేక కోట్ల మందికి టీకాల‌ను ఇచ్చారు. మే 1 నుంచి 18-44 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌వారికి కూడా టీకాల‌ను ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. కానీ చాలా రాష్ట్రాల్లో టీకాల కొర‌త కార‌ణంగా టీకాల పంపిణీకి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ టీకా తీసుకున్న వారు తాము తీసుకున్న టీకా ప‌నిచేస్తుందా, లేదా అని అనేక అనుమానాల‌కు గుర‌వుతున్నారు. కానీ అలాంటి వారిలో కింద తెలిపిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వారు తీసుకున్న టీకా ప‌నిచేస్తున్నట్లే లెక్క అని నిపుణులు చెబుతున్నారు.

if you have these symptoms then covid vaccine working fine

కోవిడ్ టీకా తీసుకున్న వారిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. దాదాపుగా 2-3 రోజుల పాటు ఉండే ఆ ల‌క్ష‌ణాలు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. జ్వ‌రం ఉంటే మాత్రం పారాసిట‌మాల్ వేసుకోవ‌చ్చు. అయితే కోవిడ్ టీకా తీసుకున్న వారిలో స్వ‌ల్పంగా కండ‌రాల నొప్పి, కీళ్ల నొప్పులు, త‌ల‌నొప్పి, అల‌స‌ట‌, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు స‌హ‌జంగానే క‌నిపిస్తాయి. అయితే ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే టీకా ప‌నిచేస్తున్న‌ట్లే అర్థం చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

శ‌రీరంలో టీకా తాలూకు మెడిసిన్ ప్ర‌వేశించ‌గానే శ‌రీరం స్పందించి ప్ర‌తిరోధ‌కాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే పైన తెలిపిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌నుక ఆయా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని, టీకా ప‌నిచేస్తున్న‌ట్లు అర్థం చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోయినా కంగారు ప‌డొద్ద‌ని, కొంద‌రికి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వ‌ని, అయిన‌ప్ప‌టికీ టీకా స‌మ‌ర్థ‌వంతంగానే ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment