Nagababu : గరికపాటి అప్పుడు అలా.. ఇప్పుడిలా.. గరికపాటిపై నాగబాబు సెటైర్లు..!

October 7, 2022 11:04 AM

Nagababu : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్‌బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు. చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికీ ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చాడు. అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది. దీంతో.. అసహనానికి గురైన గరికపాటి అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను.

లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతసేపటికి చిరంజీవి వెళ్లి గరికపాటి పక్కనే కూర్చుని ప్రవచనం విన్నారు. అంతటితో ఆ చిన్నపాటి వివాదాస్పద పరిణామానికి శుభం కార్డు పడింది. అయితే.. ఆ వీడియో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. మెగా అభిమానులు చిరంజీవిని గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడుతున్నారు. ఆయన చిరంజీవిపై అక్కసుతోనే ఇలా మాట్లాడారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గరికపాటి గతంలో చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Nagababu responded on Garikapati comments
Nagababu

తన కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానుల అసోసియేషన్ లో ఉండే వాడినని గరికపాటి చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఏఎన్నార్ సినిమా విడుదలైతే పోస్టర్స్ పై పేడ వేయడం కూడా చేశాం అంటూ గరికపాటి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానిగా గరికపాటి అప్పట్లో అలా వ్యవహరించారు. చిరంజీవిపై అక్కడున్న వారు అభిమానంతో ఫోటోలు దిగుతుంటే కాసేపు ఓపిగ్గా ఉండలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు మెగా బ్రదర్ నాగబాబు కూడా రంగంలోకి దిగి గరికపాటిపై సెటైర్లు వేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పరిపాటే అంటూ సెటైర్లు వేయడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment