Mohan Babu : మోహన్ బాబుకి ఇగో అలా కలిసొచ్చిందా.. ఆ విషయంలో చిరంజీవి కంటే మోహన్ బాబు గ్రేట్ అట‌..?

October 24, 2022 3:50 PM

Mohan Babu : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉండే వివాదాల గురించి అందరికీ తెలిసిందే.. వాళ్ల మధ్య నిజంగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం వీరి వీడియోలను పోస్ట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు. అందులోనూ మోహన్ బాబుకు ఉన్న ఈగో వల్ల జనాల్లో చులకన అయిపోయారని చెప్పవచ్చు. మోహన్ బాబు ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి మా అల్లుడు, రజనీకాంత్ నా స్నేహితుడు, చంద్రబాబు నాయుడు మా దగ్గరి బంధువు అంటూ గొప్పలు చెబుతూ ఉంటాడు.

కానీ ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఫ్యామిలీ మరియు మోహన్ బాబు మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అది ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ, మోహన్ బాబుకు మాత్రం మెగా ఫ్యామిలీ మీద అనుమానం ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి మరియు మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. అలాగే మా ఎలక్షన్స్ లో కూడా మంచు ఫ్యామిలీ విజయం సాధించి, మెగా ఫ్యామిలీ ఓడిపోవడం వలన ఈ ట్రోల్స్ ఇంకా ఎక్కువయ్యాయి. అయితే మోహన్ బాబుకి ఈగో అనేది ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నటుడిగా అతనికి ఆ అవసరం ఉంది.

Mohan Babu great in that matter instead of Chiranjeevi
Mohan Babu

అయితే కొండవీటి సింహం అనే మూవీలో ఎన్టీఆర్ తో పాటు ఆయన కొడుకు పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఈ పాత్రకు ముందుగా చిరంజీవిని ఓకే చేశారట. కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. కానీ అవి బాగా లేవు. ఎన్టీఆర్ గారితో పోటీగా చేయలేకపోయారని, చిరంజీవిని తీసేసి ఆయన స్థానంలో మోహన్ బాబుని తీసుకున్నారు. ఎవరికి భయపడక, పొగరుగా ఉండే మోహన్ బాబు కొండవీటి సింహం సినిమాలో నటించి ఎన్టీఆర్ దగ్గర మరియు ప్రేక్షకుల చేత మన్ననలు పొందారు. అందుకే నటుడికి ఈగో పొగరు అనేది ఉండాలని చెబుతుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now