యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CMS) 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 838 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. ఉద్యోగాలకు జూలై 27, 2021 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు ఈ ఏడాది ఫైనల్ ఇయర్ చదువుతున్న టువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంబీబీఎస్ తో పాటు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న అభ్యర్థులు సైతం అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 32 సంవత్సరాలు మించి ఉండకూడదు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు, ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఇలాంటి పరీక్ష రుసుం చెల్లించాల్సిందే పనిలేదు. ఇతరులు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 27 జూలై 2021 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.upsc.gov.in/సంప్రదించాలి.