బుల్లితెర నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిత తాజాగా తన భర్త రోహిత్ రెడ్డిని ఓ ఆట ఆడుకుంది. నటి అనిత సరదాగా ఫ్రాంక్ అని చెబుతూనే తన భర్త చెంప పగలగొట్టింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోహిత్ ఓ కుర్చీలో కూర్చొని ఉండగా అనిత అతని వెనక వైపు నిలబడి ఏదో మ్యాజిక్ చేస్తున్నట్లు కనిపించింది.
తన చేతిలో దారం తీసుకొని ఆ ధారాన్ని రోహిత్ చెవిలో నుంచి బయటకు తీస్తున్నట్లు నటించింది. ఈ విధంగా దారాన్ని బయటికి లాగుతూనే మరొక చేతితో తన భర్త చెంపపై చెల్లుమనిపించింది. ఈ విధంగా అనిత తన భర్త చెంప పగలగొట్టడంతో ఎంతో షాక్ అయిన రోహిత్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను అనిత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ మ్యాజిక్ ట్రిక్స్ ప్రతి ఒక్క భార్యకు నచ్చుతుంది.. తప్పకుండా ప్రయత్నించండి అంటూ క్యాప్షన్ జోడించారు.
ఈ విధంగా తనతో ఆడుకున్న తన భార్య అని తన ఊరికే వదిలేది లేదని, త్వరలోనే తన ప్రతీకారం తీర్చుకుంటానని రోహిత్ వార్నింగ్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వెండితెరపై నువ్వు నేను, శ్రీరామ్ వంటి చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించిన అనిత 2013లో రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుని బుల్లితెరపై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.