పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో తాజాగా విడుదలైన సినిమా ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అందరికీ తెలిసినదే.మూడు సంవత్సరాల విరామం తరువాత వకీల్ సాబ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ అయిన వకీల్ సాబ్ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ,దిల్ రాజు కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథను సిద్ధం చేయాలని తన రచయితలకు కోరినట్లు తెలుస్తోంది.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న దిల్ రాజు తనకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా బారిన పడి కోలుకున్న పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు.త్వరలోనే పవన్ ఈ సినిమా కథ వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.