టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని పలు భాషలలో ఎంతో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎలాంటి వార్తలు వినిపించడం లేదు. ఈ విధంగా ఉండటం తనకు ఎంతో ప్రశాంతంగా ఉందని తాజాగా ఈ నటి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే గాస్సిప్స్ వల్ల ఎలాంటి కష్టనష్టాలు ఉంటాయో తనకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో వెలుగుచూసిన డ్రగ్ మాఫియా కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సమయంలోనే ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ వచ్చినా ఆమె పై వచ్చే వార్తలు నిజమేనని నమ్మేవారు. ఇలాంటి సమయంలోనే రకుల్ ప్రీత్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
తన విషయంలో ఎలాంటి గాసిప్పులు ఎదురైనా కూడా తను ఏమాత్రం స్పందించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ గాసిప్పులు పై నేను స్పందించకపోవడం వల్ల అలాంటి వార్తలను రాసే వారే విసుగుచెంది నా గురించి గాసిప్పులు రాయడం మానేశారని ఇకపై తన విషయంలో ఇలాగే ఉంటానని చెప్పుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో, బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.