“వీడు ముసలోడవ్వకూడదే”అనే డైలాగు ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్న కృతి శెట్టి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చేసింది ఒక్క సినిమా అయినా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.తన అందం అభినయంతో ఎంతోమంది కుర్రకారులను మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలను సైతం ఆకర్షించింది.
ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తెలుగులో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.ఉప్పెన సినిమాలో తన ప్రియుని కలవడం కోసం తన తండ్రి ఎన్నో అబద్ధాలు చెప్పిన బేబమ్మ నిజ జీవితంలో మాత్రం తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది.
తనకు అబద్ధాలు చెప్పే వారు అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదని, ఏ విషయమైనా ముక్కుసూటిగా దాపరికం లేకుండా మాట్లాడే వ్యక్తి తన జీవితంలోకి వస్తే బాగుంటుందని తన మనసులోని మాటను తెలియజేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాని సరసన “శ్యామ సింగరాయ్”, రామ్ పోతినేని హీరోగా సుధీర్‌బాబుతో కలిసి “ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది”వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.