ఇంటి గుట్టు,లక్ష్మీ కళ్యాణం వంటి సీరియల్స్ లో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న చరిష్మా నాయుడు తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఈమె పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. సాక్షాత్తు తన భర్త పవన్ కళ్యాణ్ ని ఒక మాట అనినా సహించదు.ఇంతటి వీరాభిమానిగా ఉన్న ఆమె తాజాగా పవన్ కళ్యాణ్ గురించి తరచూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మాట్లాడే వారికి ఈమె గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి? మూడు పెళ్లిళ్లు చేసుకుంటే సినిమాలలో పనికిరారా? అయినా పవన్ కళ్యాణ్ మోసం చేసి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదు. ఒకరికి విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ ఈ విధంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఏ భార్య కూడా పవన్ కళ్యాణ్ తనను మోసం చేశాడంటూ ముందుకు రాలేదు..
పవన్ కళ్యాణ్ లీగల్ గానే విడాకులిచ్చి ఒక మహిళను పెళ్లి చేసుకున్నారు. కానీ ఎంతో మంది ఎవరికీ తెలియకుండా చాలా పెళ్లిళ్లు చేసుకొని ఉంటారు. వారి సంగతి ఎవరూ పట్టించుకోరు.పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుని చెడ్డవాడు అయితే ఆయనకు అంత ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది. పెళ్లి విషయంలో ఎవరి ఇష్టం వారిది. ఇంకొక్క సారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేదని ఈమె పవన్ పట్ల ఉన్న తన అభిమానాన్ని ఈ విధంగా చూపించింది.ప్రస్తుతం చరిష్మా పవన్ కళ్యాణ్ పట్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.