సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి హోదాకు అనుగుణంగా కార్లను మెయింటెన్ చేయడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోలు కొన్ని కోట్లు ఖర్చు చేసి కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎటువంటి హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడు సాధారణ జీవితానికి ప్రాధాన్యతనిచ్చే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఖరీదైన కారును కొన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ తన అవసరాల నిమిత్తం రేంజ్ రోవర్ లగ్జరీ కారును బుక్ చేశారని తెలుస్తోంది. సాధారణంగా రేంజ్ రోవర్ కార్లు కోటి రూపాయల నుంచి మొదలై ఐదు కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ బుక్ చేసిన కారు ఏకంగా 4.5 కోట్ల రూపాయలు అనే సమాచారం వినబడుతోంది. ఎంతో స్టైలిష్ గా అదిరిపోయే లుక్ లో ఉండే ఈ కారులో ఎన్నో సరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద మొత్తంలో ఖరీదు చేసి కారు కొనడంతో ఆయన అభిమానులు పవర్ స్టార్ రేంజ్ అంటే అదే మరి అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలపై తన దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నారు.