తెలుగు తెరపై హీరోయిన్ గా ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన వారిలో శ్రద్దాదాస్ ఒకరు. ఎంతో అందం అభినయం ఉన్న ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తినప్పటికీ ఆమె కెరీర్లో చెప్పుకోవాల్సిన అంత విజయవంతమైన సినిమాలు మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ నటించిన “ఏక్ మినీ కథ”ద్వారా సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్రద్దాదాస్.. బికినీ ఫోటో షూట్ జరిపి కుర్ర కారులను అలరిస్తూ ఉంటారు. అలాంటి శ్రద్ధ దాస్ ప్రస్తుతం తాను నటించిన ఏక్ మినీ కథ మంచి టాక్ తెచ్చుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో స్వామీజీగా కనిపించిన శ్రద్దాదాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా సెట్ లోని ఓ స్టిల్ ను శ్రద్ధాదాస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఫోటోలు చేతిలో సిగరెట్ పట్టుకొని దమ్ము కొడుతూ కనిపించారు. ఈ సందర్భంగా ఈ ఫోటో గురించి వివరణ తెలుపుతూ నటి ఈ విధంగా మాట్లాడారు.. విచిత్రం ఏమిటంటే నాకు సిగరెట్ తాగడం అలవాటు లేదు.. కానీ నటిగా మారిన తర్వాత నచ్చని పనులను కూడా చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తను నటించే సినిమాలలో తనకు నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితులలో చేయాల్సి వస్తుందని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రద్దాదాస్ కన్నడలో కోటిగొబ్బ, తెలుగులో అర్ధం, నిరీక్షణ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు.