బాగా దగ్గరవుతున్న అల్లు, నందమూరి ఫ్యామిలీలు..!
ఇటీవలి కాలంలో అల్లు, నందమూరి ఫ్యామిలీలు ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాయి. ఇటీవల బాలయ్య నటించిన అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ గెస్ట్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు.
బాలకృష్ణ హోస్ట్‌గా అల్లు అరవింద్ అన్‌స్టాపబుల్ అనే షో చేస్తున్నారు. ఈ సందర్భాలలో ఒకరిపై ఒకరు తెగ ప్రేమ కురిపించుకున్నారు.
మహానటి చిత్రం మంచి విజయం సాధించినప్పుడు బన్నీ టీం అందరికీ ప్రత్యేకమైన పార్టీ ఇచ్చారు.
ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీనులతోపాటు అఖండ చిత్ర యూనిట్ కి పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అఖండ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ ఈ పార్టీ ఏర్పాటు చేశారట.
బాలయ్యకు పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా నందమూరి.. అల్లు కుటుంబాల మధ్య బంధం మరింతగా బలపడుతోందని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అల్లు ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి దగ్గరవుతున్న క్రమంలో మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గతంలో చిరంజీవి గురించి ఎక్కువగా మాట్లాడే బన్నీ పేరు ఎత్తడం లేదు. అదీ కాక అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి తరచూ వార్తలలోకి ఎక్కడం.. అనేక అనుమానాలను కలిగిస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.