ఆపరేషన్లు చేసేటప్పుడు సహజంగానే డాక్టర్లు మత్తు మందు ఇస్తారు. కానీ కొన్ని ఆపరేషన్లకు మత్తు మందు ఇవ్వరు. కేవలం ఆపరేషన్ చేసే భాగానికి మాత్రమే స్పర్శ లేకుండా చేస్తారు. అయితే బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించే ఆపరేషన్‌లను కూడా అలాగే చేస్తారు. మెదడులో సూక్ష్మమైన కణాలు ఉంటాయి. అవి దెబ్బ తినకుండా ఉండేందుకు పేషెంట్లకు మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తారు. కానీ తల భాగం స్పర్శ లేకుండా చేస్తారు.
అయితే ఓ మహిళకు ఆ విధంగానే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేశారు. కానీ ఆ మహిళ ఆపరేషన్ చేసిన సమయంలో హనుమాన్ చాలీసాను పఠించింది. అందులో ఉన్న మొత్తం 40 శ్లోకాలను ఆమె చదివింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అయింది.
In #AIIMS, a woman patient recite 40 verses of #Hanuman chalisa, while @drdeepakguptans and his neuro anaesthetic team conducts brain tumor surgery.#Delhi pic.twitter.com/MmKTJsKo95
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021
@drdeepakguptans post surgery sharing details of the operation pic.twitter.com/HjzuDnNjVQ
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆ మహిళకు తాజాగా సదరు ఆపరేషన్‌ను నిర్వహించారు. అయితే ఆపరేషన్ 3 గంటల పాటు కొనసాగింది. కానీ ఆ సమయంలో ఆమె మెళకువగా ఉన్నప్పటికీ ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. డాక్టర్లు ఆమెకు విజయవంతంగా సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించారు. ఈ సందర్బంగా ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దీపక్ గుప్తా వివరాలను వెల్లడించారు. అయితే ఆమె అలా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంత ధైర్యంగా ఉన్నందుకు ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు.