మనలో కొందరు భోజనం చేసేముందు దేవుడికి ప్రార్థన చేస్తారు. భోజనానికి ముందు ప్రార్థన చేయడం అనేది అనేక వర్గాలకు చెందిన సంస్కృతుల్లో ఉంది. తమకు భోజనం ఇచ్చినందుకు దైవాన్ని ప్రార్థిస్తారు. ఎప్పటికీ అలాగే సహాయం చేయాలని కోరుకుని ఆ తరువాత భోజనం చేస్తారు. అయితే ఆ మహిళ మాత్రం తన పెంపుడు కుక్కలకు భోజనం పెడుతూ దైవ ప్రార్థన చేసింది. దీంతో ఆమె చేసిన ప్రార్థనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుక్కలు ఎంతో కాలం నుంచి మనుషులకు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువులుగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాటిని మనుషులు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మనుషులు చెప్పే ప్రతి పనిని శునకాలు చేస్తాయి. ఆ మహిళ తన కుక్కలకు భోజనం పెడుతూ దైవ ప్రార్థన చేసింది. అంతసేపు ఆ కుక్కలు ఓపిగ్గా ఉన్నాయి. తరువాత ప్రార్థన అవగానే ఆమె చెప్పినట్లు అవి భోజనం చేశాయి.
Sharing this heart-warming video of my friend teaching her pups to say their prayers before food. Me thinks both are good boys. ?@dog_rates pic.twitter.com/z5ANJDVwVn
— Vaishali Mathur (@mathur_vaishali) May 1, 2021
కాగా ఆ వీడియోను ఆ మహిళకు చెందిన స్నేహితురాలు ట్విట్టర్ లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటికే దాన్ని 24వేల మందికి పైగా వీక్షించారు. 1100కు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. చాలా మంది ఆ మహిళ చేసిన పనిని అభినందిస్తున్నారు.