సాధారణంగా మనకు పాము కనిపిస్తే ఆమడ దూరం భయంతో పరిగెత్తుతాము. అలాంటిది పామును దగ్గరగా చూడాలన్నా, పట్టుకోవాలన్నా ఎంతో కొంత ధైర్యం ఉండాలి. కానీ ఓ మహిళ ఏకంగా పామును తన తలకు చుట్టుకొని షాపింగ్ మాల్ కి రావడంతో కస్టమర్లు అందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అసలు ఆ మహిళ తలకు పాములు చుట్టుకొని రావడం ఏంటి, ఇది ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నారా..?
ఈ ప్రపంచంలో ఎంతోమంది ఫ్యాషన్ ను ఇష్టపడే వారు ఉంటారు. ఈ క్రమంలోనే వారి అభిరుచికి తగ్గట్టుగా విభిన్న పద్ధతులలో తయారవుతూ ఇలా అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఎంతో విభిన్నంగా తన జుట్టుకు పాము ఆకారంలో ఉన్న హెయిర్ బ్యాండ్ ధరించి షాపింగ్ మాల్ కి వెళ్ళింది. ఆ బ్యాడ్ అచ్చం పాముని పోలి ఉండటంతో మొదట్లో ఆమెను చూసిన కస్టమర్లు భయంతో పారిపోయారు. అయితే అది హెయిర్ బ్యాండ్ అని తెలియడంతో కొందరు ఎంతో ఆసక్తికరంగా ఆమె జుట్టుకి ఉన్న హెయిర్ బ్యాండ్ ను వీడియో తీయడం ప్రారంభించారు.
https://www.instagram.com/reel/CTAvRrlqG46/
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం ఆలోచన అంటూ కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఆమె ఆలోచనను సమర్థిస్తూ తనకు మద్దతుగా కామెంట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ పాము హెయిర్ బ్యాండ్ ఏ విధంగా ఉందో ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.