సాధారణంగా ఏదైనా కేసులో పట్టుబడి పోలీసులకు దొరికితే పోలీసులు వారి మక్కెలు ఇరగదీస్తారనే సంగతి తెలిసిందే. అయితే, బ్రెజిల్ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా దొంగను అరెస్ట్ చేయడమే కాకుండా అతనికి తెలియకుండా ఒక కేక్ కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి అతని పుట్టిన రోజు వేడుకలను పోలీస్ స్టేషన్ లో జరిపిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే ప్రాంతంలో నివసిస్తున్న పౌలో రోడ్రిగో దాస్ నివెస్ అనే ఓ యువకుడు ఇటీవల ఓ కార్ల లోని సౌండ్ బాక్స్ లు, ఆడియో సామాగ్రిని దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలలో కనిపించడంతో వాటి ఆధారంగా అతనిని అరెస్టు చేశారు. ఈ విధంగా ఆ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆ రోజు అతనికి 18 సంవత్సరాలు పడటంతో అతనికి పుట్టిన రోజు వేడుకలను జరిపారు.
ఈ విధంగా దొంగతనంతో పట్టుబడి పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో బాధగా అనిపించినా
దాస్ కేక్ కట్ చేసి తన తల్లికి కూడా పంపించారు. ప్రస్తుతం ఈ విధంగా దొంగ కు బర్త్ డే వేడుకలను నిర్వహించిన ఈ వీడియో ఉన్నతాధికారుల వరకు చేరడంతో అధికారులు పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రెజిల్ మిలటరీ పోలీస్ అధికారులు వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పోలీసులు ఈ విధంగా బర్త్డే వేడుకలు నిర్వహించడానికి గల కారణం అతనికి 18 సంవత్సరాలు పడటంతో అతడు చేసిన నేరాలకు తగిన శిక్ష పడుతుందన్న క్రమంలోనే పోలీసులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని కామెంట్లు చేస్తున్నారు.