ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరగడంతో చాలామంది స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా ఫ్రాంక్ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరిగింది.అయితే ఈ ఫ్రాంక్ వీడియో యువకుడికి మాత్రం రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు… అతనికి ఎందుకు జైలు శిక్ష పడింది అనే విషయానికి వస్తే..
మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్ రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన తర్వాత ఒక భోగిలోకి వెళ్లి ఉన్నఫలంగా దగ్గుతూ కుప్పకూలి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. మొదట్లో అతను కిందపడగానే అతనికి సహాయం చేయడానికి కొందరు వచ్చినప్పటికీ అతడు విపరీతంగా దగ్గడం చేత అందరు కరోనా భయంతో రైలును ఆపి అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
Когда пранк вышел из-под контроля!
В Москве задержали шутника, разыгравшего в метро приступ коронавируса. Полиция попросила Черемушкинский суд столицы арестовать молодого человека. pic.twitter.com/fmT17RUijQ
— ВЕСТИ (@vesti_news) February 10, 2020
ఈ విధంగా రైలులో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టడంతో డిహబోరోవ్ పైకి లేచి ఇది ఫ్రాంక్ వీడియో అని చెప్పడంతో రైలులోని ప్రయాణికులు అతనిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో ఈ వీడియో చూసిన అధికారులు ప్రాంక్‌స్టార్ డిహబోరోవ్ పై కేసును నమోదు చేసి అతనికి రెండు సంవత్సరాలపాటు జైలుశిక్ష విధించారు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరికి కూడా శిక్ష పడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.