ప్రస్తుత కాలంలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాటిలో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం,వారు పెట్టే పోస్టులకు వీడియోలకు అధిక సంఖ్యలో లైకులు రావడం కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. అచ్చం ఇలాంటి పరిస్థితులలో ఓ గుజరాత్ యువతి చిక్కుకున్నారు.
ప్రస్తుతం గుజరాత్ మొత్తం కరోనా కేసులు తీవ్రం కావడంతో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. అయితే రాజ్ కోట్ కు చెందిన ప్రిషా రాథోడ్ అనే యువతి పలు ఈవెంట్లను చేస్తూ, సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే పోస్టులకు ఫాలోవర్స్ కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇన్ స్టాలో ఉన్న తన ఫాలోవర్ల కోసం ఆమె ఒక సాహసానికి తెర తీశారు. కర్ఫ్యూ సమయంలో రోడ్డు పైకి వచ్చి ఓ పాటకు డాన్స్ వేశారు.దీనికి సంబంధించిన వీడియోను సర్ప్రైజ్ అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది.
ప్రిషా రాథోడ్ షేర్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు కర్ఫ్యూ నిబంధనలను ఈ విధంగా బ్రేక్ చేయడం ఏమిటి అంటూ? పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ప్రిషా రాథోడ్ తెలియడంతో వెంటనే ఆ వీడియో డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆమె షేర్ చేసిన వీడియో ఎంతోమంది షేర్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విధంగా పోలీసులు కేసు బుక్ చేయడంతో తను కావాలనే తప్పు చేయలేదని మొదటిసారి జరిగిన తప్పుకు తనను క్షమించాలని వేడుకుంది.ఇకపై ఇలాంటి నిబంధనలను ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి పంపారు. కానీ ఆమెపై బుక్ చేసిన కేసు అలాగే ఉండడంతో ఈ అమ్మడు తెగ టెన్షన్ పడిపోతున్నారు
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…