ట్రాఫిక్ నిబంధనలను అనుసరించడం మరియు రోడ్లపై రూల్స్ పాటించండి అని పోలీస్ డిపార్ట్‌మెంట్ పదే పదే ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇది పౌరులకే కాదు, పోలీసు అధికారులందరికీ కూడా వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. సరిగ్గా పెట్టుకోకపోయినా వాహనదారుల నుంచి జరిమానాలు వేసి వాటిని వసూలు చేయడం కామనే.. కానీ కర్ణాటకలోని బెంగళూరులో ఓ పోలీసుకే ఫైన్ పడింది. ట్రాఫిక్ పోలీసులు.. మరో పోలీసుకు జరిమానా విధించారు.
తప్పుడు హెల్మెట్‌ను ధరించినందుకు ఫైన్ వేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ అవుతుంది. గేర్‌లెస్ స్కూటర్‌ను నడుపుతూ.. సిటీ రోడ్లలో నిషేధించబడిన హాఫ్ హెల్మెట్ ధరించినందుకు ఒక పోలీసుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సంబంధిత ఫోటోలను ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఒక యూజర్ అతను చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు.
అసలు ట్రాఫిక్ నిర్వహణ ఎలా చేయాలో అది మీ ప్రధాన బాధ్యతగా భావించాలి అని కామెంట్ పెట్టాడు. మరొకరు యూజర్.. సార్ ఇది ఇంకా ఎక్కువ చేయాలి. చాలామంది పోలీసులు హెల్మెట్ లేకుండా వెళ్లడం.. పోలీసులు అలాంటి పోలీసులను వెళ్లనివ్వడం నేను చూస్తున్నాను. అని కామెంట్ పెట్టాడు. ఇంకో యూజర్ నియమాలు అందరికీ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్‌ని అనుసరించండి. హెల్మెట్ పెట్టుకోండి అని పెట్టగా.. మరొకరైతే ఇది పబ్లిసిటి స్టంట్ అని వ్యాఖ్యానించారు. పోలీసులు మాత్రం నెటిజన్ల నుంచి ఈ రకమైన మిశ్రమ స్పందనను అస్సలు ఊహించి ఉండరు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…