సైకిల్ తయారు చేయాలంటే ఎన్నో వస్తువులు కావాలి. కానీ ఆర్టిస్టులకు మాత్రం అలాంటి వస్తువులతో పనిలేదు. తమ మనసులో ఏదైనా ఆలోచన మెదిలితే చాలు వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తారు. ఈ విధమైన ఆలోచన చేసిన వారిలో ఒడిశాకు చెందిన ఈ కళాకారుడే నిదర్శనం అని చెప్పవచ్చు.తనకు వచ్చిన విభిన్నమైన ఆలోచనను ఉపయోగించి ఏకంగా అగ్గిపుల్లలతో సైకిల్ నమూనాలు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఏకంగా 3653 అగ్గిపుల్లలను ఉపయోగించి ఈ కళాకారుడు పెన్నీ ఫార్తింగ్ సైకిల్’ నమూనా తయారు చేశాడు.1870లో ఉండే ఈ సైకిల్ కు రెండు చక్రాలు సమానంగా ఉండవు. ఒకటి పెద్దగా ఉంటే మరొకటి చిన్నదిగా ఉంటుంది. 50 ఇంచుల పొడవు, 25 ఇంచుల వెడల్పు గల ఈ సైకిల్ ను పూరీకి చెందిన శాశ్వత్ రంజన్ సాహూ కేవలం 7 రోజులలోనే పూర్తి చేశాడు.
ప్రస్తుతం ఈ సైకిల్ నమూనా కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాహూ మాట్లాడుతూ… స్కూలు చదువుకునే రోజుల్లోనే ఈ సైకిల్ గురించి విన్నాను, ఎలాగైనా ఈ సైకిల్ తొక్కాలంటే ఆశ తనకు ఉండేదని అయితే ప్రస్తుతం అందుబాటులో లేకపోవటం వల్లే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఈ సైకిల్ నమూనాను తయారు చేసినట్లు తెలిపారు. మరింకెందుకాలస్యం ఇంత అద్భుతమైన ఈ ఫోటో పై మీరూ ఓ లుక్కేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…