కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల పెళ్లిళ్ల వంటి శుభ కార్యాలకు పరిమిత సంఖ్యలో అతిథులతో అనుమతులు ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఆ కార్యాలపై పూర్తిగా నిషేధం విధించారు. అయితే శుభ కార్యాలకు అనుమతులు ఉన్న చోట్లలో అనుమతి ఇచ్చిన సంఖ్యలో కాకుండా కొన్ని చోట్ల భారీ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వస్తోంది. అయితే అక్కడ మాత్రం పోలీసులు అతిథులకు వింతైన శిక్ష విధించారు.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా ఉమరై గ్రామంలో తాజాగా ఓ పెళ్లి జరిగింది. అయితే ఆ వేడుకకు ఏకంగా 300 మందికి పైగా అతిథులు వచ్చారు. కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ కొందరు మాత్రం పోలీసులకు చిక్కారు.
తమ చేతికి చిక్కిన కొంత మందిచే పోలీసులు కప్ప గంతులు వేయించారు. ఎవరైనా ఆ గంతులు వేయకపోతే వారిని పోలీసులు లాఠీలతో బెదిరించారు. దీంతో వారు గంతులు వేయకతప్పలేదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…