భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటితో 74 సంవత్సరాలు పూర్తి అయి 75 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకున్నారు.ఈ క్రమంలోనే దేశభక్తికి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉపయోగించినటువంటి పోస్టేజ్ స్టాంపులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే అప్పటి పోస్టేజ్ స్టాంపును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టును షేర్ చేస్తూ ఈ స్టాంపును మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా విడుదల చేశారని చెబుతూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Postage Stamp issued in 1947 to commemorate India’s Independence. #AzadiKaAmritMahotsav pic.twitter.com/qsY3OEQrEN
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2021
దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటిలో విడుదల చేసిన ఈ స్టాంపులో మువెన్నల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ స్టాంపు పై1947 ఆగస్టు 15 అని రాసి ఉంది. అలాగే జై హింద్ అనే హిందీ అక్షరాలతో ఈ స్టాంపు పై రాసి ఉంది. ఈ స్టాంపులు 1947 నవంబర్ 21న విడుదల చేశారు. అప్పట్లో ఈ స్టాంపు విలువ మూడున్నర అణాలు దీనిని విదేశీయుల కోసం ఏర్పాటు చేశారు. ఇకపోతే 75 వ స్వాతంత్ర వేడుకలను చేయడం కోసం ఏర్పాట్లు అన్నిటిని అధికారులు పూర్తి చేశారు.