సమాజంలో మంచి చేద్దామని కొందరు ప్రయత్నిస్తుంటారు. కానీ వారికి కొన్ని సందర్భాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఇక కొందరికైతే ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. తాజాగా ఓ యువతికి కూడా ఇలాగే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో అందరికీ మాస్కుల పట్ల అవగాహన కల్పించాలని ఆమె ఒక పనిచేసింది. కానీ అది బెడిసికొట్టింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో బిజీగా ఉన్న రోడ్డు కూడలిలో సడెన్ గా ఓ వైపు రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ఓ యువతి అక్కడకు వచ్చి జీబ్రా క్రాసింగ్ మీద డ్యాన్స్ లు చేయడం మొదలు పెట్టింది. అయితే ఆమె ట్రాఫిక్ గైడ్‌గా అక్కడ పనిచేస్తూ అందరినీ అలా ఎంటర్‌టైన్ చేస్తుందని అక్కడి వాహనదారులు భావించారు. కానీ ఆమె అక్కడ డ్యాన్స్ చేసింది వేరే విషయం కోసం.
ఆమె పేరు శ్రేయా కాల్రా. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చాటి చెబుతూ ఆమె అలా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్యాన్స్ చేసింది. అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె తరువాత ఇదే విషయంపై స్పందిస్తూ.. తాను ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడలేదని, రెడ్ సిగ్నల్ పడి ఉన్నప్పుడే డ్యాన్స్ చేశానని, గ్రీన్ సిగ్నల్ పడగానే తప్పుకున్నానని తెలిపింది. మాస్కులను ధరించాలని అవగాహన కల్పించడం కోసమే అలా డ్యాన్స్ చేశానని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఏది ఏమైనా ఆమె ఒక మంచి పని చేద్దామని ప్రయత్నించింది. కానీ అది అలా బెడిసికొట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…