సాధారణంగా మనం రావి చెట్టు కాయలు, మామిడి చెట్టుకు మామిడి కాయలు కాయడం చూస్తుంటాము. కానీ మీరు ఎప్పుడైనా రావి చెట్టుకు మామిడి కాయలు కాయడం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా రుషికేశ్‌లో మాత్రం రావిచెట్టుకు మామిడి కాయలు కాసిన ఘటన చోటుచేసుకుంది. ఈ విధంగా రావి చెట్టుకు మామిడి కాయలు కాయడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన చూడటానికి జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
రిషికేశ్ లో ఉన్న పలు ఆలయాలను దర్శించడం కోసం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రావి చెట్టుకు మామిడికాయలు వేలాడుతున్నట్టు గమనించారు. ఈ వింత గమనించిన వారు ఆ నోటా ఈ నోటా పాకడంతో ఈ విషయం కాస్తా ప్రజలందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే ఈ వింత ఘటనను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రావిచెట్టుకు ఈ విధంగా మామిడి కాయలు కాయడంతో ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. దీంతో ఈ ఘటన చూసిన కొందరు ప్రజలు ఈ సంఘటనను తమ సెల్ఫోన్లో వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మాధ్యమాలలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.
https://twitter.com/HinduProwd/status/1401114747215351808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1401114747215351808%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fodd-news%2Fmangoes-to-banyan-tree-rishikesh-in-dehradun-479605.html
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది నిజమైన వార్తనీ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో దాగి ఉన్న నిజం ఏమిటంటే.. తాజాగా వచ్చిన తుఫాను వల్ల పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దగ్గర్లోనే ఉన్న మామిడి చెట్టు కొమ్మ విరిగి చెట్టు పై వచ్చి పడింది. దీంతో రావిచెట్టుకు మామిడి కాయలు కసాయనే విషయం వైరల్ గా మారింది. నిజానికి అవి మామిడి చెట్టుకు కాసిన మామిడికాయలేనని తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.