Lorry Driver Incident : రోడ్డు ప్రమాదాలు అనేవి చెప్పకుండానే జరుగుతాయి. కానీ వాటి నుంచి తప్పించుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిందని చెబుతుంటే మనం చాలా సార్లు విని ఉంటాం. అయితే అక్కడ కూడా సరిగ్గా అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
హైదరాబాద్‌లోని చంపాపేటలో స్థానికంగా ఉండే అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి ఏప్రిల్ 15వ తేదీన రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఆరామ్‌ఘర్ నుంచి లక్ష్మీ గార్డెన్స్ వైపు వస్తున్నాడు. అయితే అదే సమయంలో లారీతో వెనుక నుంచి వచ్చిన పృథ్వీరాజ్ అనే డ్రైవర్ లారీని వేగంగా నిర్లక్ష్యంగా నడిపించాడు. దీంతో మజీద్ టూవీలర్‌ను లారీ ఢీకొట్టింది. అయితే అదే సమయంలో చాకచక్యంగా మజీద్ బైక్ మీద నుంచి తప్పించుకుని లారీకి ఒక వైపున ఎక్కి నిలబడ్డాడు.

ఓ వైపు బైక్ లారీ ముందు చక్రాల కింద పడి నలిగిపోతున్నా, ఒక వ్యక్తి లారీ డోర్ పట్టుకుని నిలుచున్నా డ్రైవర్ మాత్రం లారీని ఆపలేదు. అలాగే పోనిచ్చాడు. తరువాత మజీద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లారీ డ్రైవర్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే లారీ అలా వెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న కొందరు ఆ మొత్తం సంఘటనను వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్‌పై మండిపడుతున్నారు. అంతటి ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఆ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఆ లారీ ఆ తరువాత ఇంకో కార్‌ను కూడా ఢీకొట్టిందని, ఈ క్రమంలో డ్రైవర్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Dear Sir, See this incident, this was happened on owaisi hospital to Lb Nagar to hayath Nagar Route, please alert all police stations on this route pic.twitter.com/9SgrtvmGUd
— Ravikumar Inc Tpcc lb nagar (@V24751Vadlamudi) April 14, 2024