కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అనేక చోట్ల సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ప్రజలు కోవిడ్ జాగ్రత్తలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా ఎండలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చత్తీస్‌గడ్‌కు చెందిన డీఎస్‌పీ శిల్పా సాహు 5 నెలల గర్భిణి. అయినప్పటికీ ఆమె ఎండలో డ్యూటీ చేస్తోంది. మండుటెండలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడమే కాక, కోవిడ్ రూల్స్‌ను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె అలా పనిచేస్తున్నప్పుడు తీసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
Well done Shilpa Sahu. But do take care of yourself +1 as well.@dantewadapolice https://t.co/MHFSbE5qG2
— RK Vij (@ipsvijrk) April 20, 2021
She has to be extremely cautious!!
— Rajesh Surana ?? (@rajeshklsurana) April 20, 2021
#छत्तीसगढ़ : मिलीए शिल्पा साहू से, ये 2016 बैच की DSP है, ये #नक्सल प्रभावित #दंतेवाड़ा मे पदस्थ है, ये 5 महीने की गर्भवती है, ये लाकडाउन मे हाथ मे डंडा लेकर धूप मे सड़क पर उतरी, टीम के साथ चालानी कार्रवाई की, ये लोगों को समझा रहीं है, कि आप घर पर रहे, सुरक्षित रहे।?@CG_Police pic.twitter.com/8g7dkqHdDL
— Vijay Kedia (@TheVijayKedia) April 20, 2021
అయితే ఆమె అలా డ్యూటీ చేస్తుండడాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం గర్భిణీకి డ్యూటీ ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు కోవిడ్ సమయం, కనుక ఆమె జాగ్రత్తగా ఉండాలి.. అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.