సాధారణంగా మద్యం సేవించిన వారు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఉండి వారికి తోచిన పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మత్తు వదిలితే తప్ప వారు చేస్తున్న పని ఏంటో గ్రహించలేరు. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో విమానాశ్రయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అతను చేసిన పని చూసి అక్కడున్న వారందరూ కొంతమేర ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు అనే విషయానికి వస్తే..
రష్యా మాస్కోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ఓ వ్యక్తి మద్యం సేవించి వచ్చాడు. మద్యం సేవించి ఉండటం వల్ల అతను దారి కూడా సరిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు రన్ వే పైకి వెళ్లకుండా మత్తులో ఎయిర్పోర్టులోనే కన్వేయర్ బెల్ట్ వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అతని కింద పడిపోవడంతో అతని షూ ఒకటి ఊడిపోగా అతని బ్యాగ్ హ్యాండ్ రైల్ కి చిక్కుకుపోయింది.
ఇలా ఎంతో కష్టపడి బ్యాగ్ ను దక్కించుకున్న అతను తర్వాత షూ కోసం వెతకసాగాడు. ఈ క్రమంలోనే కన్వేయర్ బెల్ట్ పై కొంత దూరం ప్రయాణం చేశాడు. చివరకు ఆ వ్యక్తి బ్యాగేజ్ స్క్రీనింగ్ గేట్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్నటువంటి సిసి టివి ఫుటేజ్ లో రికార్డు కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…