ప్రభుత్వ ఉద్యోగాలలో కొలువై ఉన్న అధికారులు వారు ప్రజలకు సేవ చేయడం కోసమే అధికారంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పనులు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు అధికారులు ఆ విషయాన్ని మర్చిపోయి వారు గొప్ప స్థాయిలో ఉన్నామని భావించి ఎంతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విధంగానే ఓ అధికారి దురుసు ప్రవర్తన తీవ్ర పరిణామాలకు దారి తీసింది.రాజస్థాన్ జలోరి జిల్లాలో శాంఖోర్ ఏరియాలో.. రైతులపై తిరగబడిన అధికారి ఏకంగా రైతులను కాలితో తన్నిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు వేయిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతాప్పురా గ్రామం మీదుగా రోడ్డు వెళ్తుంది. అయితే ప్రతాప్పురా గ్రామ రైతులు అధికారులను అడ్డుకున్నారు.కేంద్ర ప్రభుత్వం రోడ్డు వేయడానికి తమ భూములను లాక్కొని వారికి పరిహారం చెల్లించలేదని అది చెల్లించే వరకు రోడ్డు వేయడానికి వీలు లేదని రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి ఏకంగా రైతులపై తిరగబడి వారిని కాలితో తన్నాడు. అదే విధంగా 15 సంవత్సరాల బాలికను తన బండితో పాటు కొంతదూరం లాక్కెళ్లి తోసాడు.
https://twitter.com/lkantbhardwaj/status/1415895641335635968
ఈ విధంగా రైతుల పై తిరగబడటమే కాకుండా పదిహేను సంవత్సరాల బాలికపై అరాచకంగా ప్రవర్తించడంతో రైతులు మహిళలు అధికారులు పై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.తమ పొలాలను లాక్కొని వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్లు వేయడానికి గ్రామస్తులు ఒప్పుకోలేదు. అయితే ఇదే విషయమై తమకు న్యాయం జరగాలని రైతులు కోర్టును ఆశ్రయించగా కరోనా కారణం చేత కోర్టు మూతపడటంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు.ఈ క్రమంలోనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కోర్టు తీర్పు వచ్చే వరకు రోడ్డు పనులను ఆపివేస్తున్నట్లు రోడ్డు నిర్మాణ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.